శ్రీకాకుళంః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు పాలనతో విసిగి వేసారిన టీడీపీ నాయకులంతా వైయస్ఆర్ సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కాగువాడ గ్రామ టీడీపీ నేతలు వైయస్ఆర్ సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో అర్జున్ బిషాయ్, ఆదినారాయణ, గణపతి ఆదినారాయణ, మాధవరావు బిషాయ్, కటకం రామారావు, సోమన సాహు, సుభాష్ సాహు, సురేష్, గణపతి, పైడి నాయుడు, జోగిందర్ తదితరులు ఉన్నారు.