<br/><br/>వైయస్‌ఆర్ జిల్లా: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ జిల్లా కడప నగరంలోకి కలెక్టరేట్ వద్ద కరువుపై పోరు ధర్నా నిర్వహించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. కరువు మండలాల్లో సహాయక చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. «వైయస్‌ఆర్ జిల్లా ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేయాలని పార్టీ నేతలు, రైతులు డిమాండు చేశారు. దర్నా కార్యక్రమంలో పార్టీ మాజీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, నాయకుడు మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.