పిచ్చి తుగ్లక్ లా పాలన..!

కాకినాడః వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పిచ్చి తుగ్లక్ లా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రజాస్వామ్యబ్దధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలా నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీపై 75 శాతం వ్యతిరేకత రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సాగునీటి సంఘాల ఎన్నికలపై ప్రజలు న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

గండేపల్లి రోడ్డు ప్రమాద ఘటనలో మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుడు రాజకీయాలు చేశారని నెహ్రూ ఆరోపించారు. పుష్కరాల్లో తొక్కిసలాటకు చంద్రబాబు కారణమనే రూ.10 లక్షలు ఇచ్చారని అన్నారు. ఇక పట్టిసీమలో పంపులు ఎక్కడున్నాయో తెలియకుండానే టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. 
Back to Top