వైయస్సార్సీపీలో పలువురి చేరిక

తూర్పుగోదావరి జిల్లాః వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ పట్టాభి సీతారామయ్య ఆధ్వర్యంలో ఏడిద గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ  సమక్షంలో వారికి  పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ...పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు బాగుపడాలన్నా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు సాధించుకోవాలన్నా వైయస్సార్సీపీని గెలిపించుకోకతప్పదని అన్నారు. 

అధ్యక్షులు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసేవరకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ టీడీపీకి ఓటేసినందుకు పశ్చాత్తాప పడుతున్నారని, వైయస్ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని సీతారామయ్య చెప్పారు.  ఈసమావేశంలో పార్టీ ఏడిద శాఖ కన్వీనర్ గరగపాటి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top