మాజీ ఎంపీ సైదయ్యకు ఎమ్మెల్యే జంకె పరామర్శ

గుంటూరు: నరసరావుపేట మాజీ పార్లమెంట్‌ సభ్యుడు కోటా సైదయ్యను మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురం వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పరామర్శించారు. ఎంపీగా కోటా సైదయ్య ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఆయన పార్లమెంట్‌ నియోజకవర్గంలోని మార్కాపురం నుంచి జంకె వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సైదయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకున్నారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాచర్ల శాసన సభ్యుడు, పార్టీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలుసుకుని పలు విషయాలపై చర్చించారు. 

Back to Top