<br/>తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మంచి నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా నిరసన కార్యక్రమం చేపడితే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. రాజానగరం మండలంలో తాగునీటి కోసం వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి పట్టించుకోకపోవడంతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు హైవేను దిగ్భందించారు. వైయస్‌ఆర్‌సీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా నేతృత్వంలో పార్టీ శ్రేణులు మానవహారం చేపట్టారు. హైవేపై జక్కంపూడి విజయలక్ష్మీ, రాజా బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్టు చేయడంతో ఉధ్రిక్తత నెలకొంది. ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో బాధపడుతుంటే అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారులు స్పందించకపోవడంతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఖండించారు.