జై జగన్నినాదాలతో దద్దరిల్లిన కొవ్వూరు

కొవ్వూరు (ప.గో.జిల్లా) :

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ‌తనయ శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొవ్వూరులో జనప్రవాహం మధ్య సాగింది. శ్రీమతి షర్మిల పాదయాత్రకు జనం పోటెత్తారు. కొవ్వూరులోని రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. రాజన్న కూతురుకు మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, వికలాంగులు.. అన్ని వర్గాల ప్రజలూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆప్యాయంగా స్వాగతం పలికారు. తమ గుండెల్లో దేవుడిగా కొలువైన రాజశేఖరరెడ్డి తనయను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.

దొమ్మేరు శివారు నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైన శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొవ్వూరుకు చేరుకోగానే వి.బాలాజీ, శ్రీవర్థన్ అనే ఇద్దరు చిన్నారులు ‘వు‌య్ మిస్‌‌యూ.. వైయస్‌ఆర్.. వె‌ల్‌కమ్ టు జగ‌న్’ అంటూ ప్లకార్డు పట్టుకుని‌ శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. మెరకవీధి సెంటర్‌, విజయవిహా‌ర్ సెంట‌ర్లలోని మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహా‌లకు శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించారు.

శ్రీమతి షర్మిల పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.వి. మైసూరారెడ్డి, విజ‌య్‌చందర్, పార్టీ జిల్లా‌ పశ్చిమగోదావరి కన్వీనర్ తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషేన్‌రాజు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు అనంత వెంటక రమణచౌదరి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు రాజీవ్‌కృష్ణ, చలుమోలు అశోక్‌గౌడ్, కొఠారు రామచంద్రరావు, ‌పి.వి. రావు, గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, తోట గోపి, చీర్ల రాధయ్య, కండిబోయిన శ్రీనివా‌స్, తలారి వెంకట్రావు, పార్టీ నాయకులు పరిమి హరిచర‌ణ్, ముదునూరి నాగరాజు, పార్టీ జిల్లా మహిళా కన్వీన‌ర్ గూడూరి ఉమాబాల, మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర, ‌బి.సి. సెల్ జిల్లా కన్వీనర్ పాశం రామకృష్ణ, గోలి శర‌త్‌రెడ్డి, దుడ్డిగర్ల సువర్ణరాజు, బండి అబ్బులు, యీవని భాస్కర్‌, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Back to Top