జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

మల్దకల్ (మహబూబ్ నగర్ జిల్లా):  వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అన్నారు. అందుకు పక్కా ప్రణాళికలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని,  రానున్న రోజుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధర్మాన కృష్ణదాసు ధీమా వ్యక్తం చేశారు. రాష్ర్టంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే విజయం వరిస్తుందని కృష్ణదాసు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెడుతారని ఆయన అన్నారు.

పాలమూరు జిల్లా మల్దకల్లో కొనసాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు.  మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం రాష్ర్ట ప్రజలకు పెను శాపంగా మారిందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.

Back to Top