జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు అమలు

వరంగల్:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ప్రజా సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని పార్టీ జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని కొత్తవాడకు చెందిన ముస్లిం, మైనారిటీ యువకులు పలువురు సయ్యద్ చాంద్‌పాషా ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. హన్మకొండలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

     ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయడం శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డికే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. దీంతో వివిధ పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు.  శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి బయట ఉంటే తమ పార్టీలను మూసుకోవాల్సి వస్తుందనే భ యంతోనే ఆయనపై తప్పుడు కేసులు బనాయించి జైలు కు పంపించారని ఆరోపించారు.

ప్రజల నుంచి మహానేతను విడదీయలేరు

      దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రైతుల పక్షపాతిగా, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రజల మనసుల్లో నుంచి మహానేతను ఎవరూ విడదీయలేరన్నారు. మహానేత ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు దేశంలోనే బహుళ ప్రజాదరణ పొందాయని, ఆ పథకాలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వ్యవసాయమే దండగ అంటే వైయస్ఆర్ ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఆదుకున్నారని అన్నారు.  అంతేకాకుండా తక్కువ ధరలకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి పండగ చేసి చూపించారని గుర్తు చేశారు. ధరలను నియంత్రించలేని కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు బనాయించి ప్రజాదరణ కలిగిన శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని జైలుకు పంపించారని ఆరోపించారు.

Back to Top