జగన్ సీఎం అవుతారు: రెహ్మాన్

అనంతపురం: వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ తన సత్తా చూపి ముఖ్యమంత్రి అవుతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం కన్వీనర్ రెహ్మాన్ చెప్పారు. మహానేత వైయస్ఆర్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. అందుకే షర్మిలమ్మ యాత్రలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. మరో ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుగూ లోకేష్ కు వారసత్వం కల్పించేందుకు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఆయనది రాజకీయయాత్రలా ఉందన్నారు. 
వేలాదిగా హాజరుకావాలి
మంగళవారం మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించబోయే షర్మిల పాదయాత్రకు వేలాదిగా హాజరుకావాలని ఆ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. షర్మిలమ్మకు ఘనస్వాగతం పలకాలని కోరారు.
Back to Top