జగన్‌ను కలిసిన జలగం, సబ్బం

హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు అయిన జలగం వెంకట్రావు గురువారం చంచల్‌గుడా జైలులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. వైయస్ కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఈ నేపథ్యంలో జగన్‌కు మనోధైర్యాన్నించ్చేందుకు ఆయనను కలిశానని వెంకట్రావు చెప్పారు. త్వరలోనే పార్టీలో చేరతానని ఆయన వెల్లడించారు. వైయస్ఆర్ ఆశయాల కోసం పనిచేయాలన్న అభిలాష ఉందన్నారు. అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు సబ్బం హరి కూడా గురువారం చంచల్‌గుడా జైలులో జగన్‌ను కలిశారు.

Back to Top