జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రజల ఆకాంక్ష

గుంటూరు సెంట్రల్ (గుంటూరు జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలను జననేత జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందన్నారు. వైఎస్ జగన్ జన్మదినం పురస్కరించుకుని పార్టీ నాయకుడు ఏటిగడ్డ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కొరిటెపాడులోని కరణంగారి వీధిలో శ్రీ లక్ష్మీగణపతి హోమాన్ని నిర్వహించారు. నవులూరి సాయిబాబుదీక్షితులు ఆధ్వర్యంలో ఈ హోమాన్ని ఏటిగడ్డ దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినం పురస్కరించుకుని సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అధికార కాంగ్రె స్, విపక్ష టీడీపీలను ప్రజలు నమ్మేపరిస్థితిల్లో లేరన్నారని సుచరిత అన్నారు.

Back to Top