జగన్‌కు కోటి కుటుంబాల మద్దతు

కొత్తపేట:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి కోసం సంతకాలు చేసేందుకు కోటి మంది కాదు కోటి కుటుంబాలు ముందుకొస్తున్నాయని రాజమండ్రి నగర మాజీ మేయర్, పార్టీ నాయకుడు ఎంయస్  చక్రవర్తి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేటలో నిర్వహించిన జనసంతకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో పాటు వరుసలో నిలుచుని జగ్గిరెడ్డి, చక్రవర్తి సంతకాలు చేశారు. దివంత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబానికీ, ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికీ లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని శ్రీ జగన్‌కు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారన్నారు.

రాజకీయ కక్షతోనే కేసులు
దాక్షారామ: రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ శ్రీ వైయస్  జగన్మోహన్‌ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఆయన భార్య, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు యనమదల గీత ఆరోపించారు. శ్రీ వైయస్ జగన్ కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని రామచంద్రపురం మండలం కన్నడతోటలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యనమదల మాట్లాడారు. శ్రీ జగన్‌కు బెయిల్ రావాలని కోరుతూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు.

తాజా వీడియోలు

Back to Top