జగన్ కోసం‌.. రెహ్మాన్ నెత్తు‌రుతో సంతకం!

హైదరాబాద్‌ : జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సిఎం కావడం తథ్యం అని వైయస్‌ఆర్‌సిపి మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీన‌ర్ హెచ్‌ఎ రెహ్మాన్ ‌ధీమా వ్యక్తం చేశారు. శ్రీ జగన్ నిర్బం‌ధించడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం వైయస్‌ఆర్‌సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో‌ శనివారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెహ్మాన్ తన రక్తంతో సంతకం చేసి సంతకాల సేకరణను ప్రారంభించారు.‌

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలకు ఉన్నత విద్యలో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం, ఉపకార వేతనాలు ఇప్పించారని ఈ సందర్భంగా రెహ్మాన్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన చలవ వల్లే ఎందరో మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. అందువల్ల ఆ మహానుభావుని తనయుడు శ్రీ జగన్‌కు రాష్ట్రంలోని మైనారిటీలంతా అండగా నిలుస్తున్నారని రెహ్మాన్ అన్నారు.
Back to Top