జగనన్నను ఆశీర్వదించండి

నర్సందొడ్డి(మహబూబ్‌నగర్):

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా గద్వాల నియోజకవర్గంలోని నర్సందొడ్డిలో శ్రీమతి వైయస్ షర్మిల రచ్చబండ నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల 43వ రోజు పాదయాత్రలో గురువారం నెట్టెంపాడు ప్రాజెక్టును సందర్శించి, అక్కడ మహానేత విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. అనంతరం, పాదయాత్రగా వెడుతూ ప్రజలతో మమైకమవుతూ సాగారు. నర్సంపాడు గ్రామంలో మహిళలతో రచ్చబండ నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ బతికుంటే రైతుకు తొమ్మిది గంటల కరెంటు అంది ఉండేదన్నారు. ప్రస్తుత సర్కారు కరెంటు విషయాన్ని పట్టంచుకోవడం లేదని చెప్పారు. చదువుకుందామన్నా, నీళ్ళు పట్టుకుందామన్నా, పనిచేసుకుందామన్నా, ఇలా ఏ అవసరానికీ కరెంటు  ఉండటం లేదని తెలిపారు. కానీ విద్యుత్తు బిల్లులు మాత్రం షాక్ కొడుతున్నాయన్నారు. ఎంప్పుడో మూడేళ్ళ క్రితం వాడిన కరెంటుకు ఇప్పుడు సర్చార్జి వేసి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ వైయస్ఆర్ తన పాలనలో ఎన్నడూ చార్జీలు పెంచలేదన్నారు. గ్యాస్ ధర పెంచితే రాష్ట్ర ప్రభుత్వమే ఆరోజుల్లో భరించిందనీ, కరెంటు ఛార్జీలు కానీ, బస్సు ఛార్జీలు గానీ మహానేత పెంచలేదనీ, ఎందుకంటే ఆ భారం మహిళలపై పడుతుందని చెప్పేవారనీ శ్రీమతి షర్మిల వివరించారు. ఆయనే ఉండుంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం వచ్చేదన్నారు. మంచినీళ్ళు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటికోసం కిలోమీటర్ల తరబడి నదవాల్సి వస్తోందన్నారు. మహిళలను ఇబ్బంది పెడుతున్న ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించి సమాధానం రాబట్టి మహిళలలో ఉత్సాహాన్ని నింపారు శ్రీమతి షర్మిల.   వైయస్ఆర్ గారున్నప్పుడు ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని ఉపయోగించుకుని లక్షలమంది పెద్ద చదువులు చదువుకున్నారు. పెద్ద చదువులు చదువుకోవాలని ఇప్పటి ప్రభుత్వం భావించడంలేదనీ, అందుకనే ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఇప్పటికే చాలామంది స్తోమతు లేక  చదువులు మాని  ఇంట్లో కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయనీ, కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందనీ, ఉన్నవాటిని నిలబెడితే చాలనీ ఆమె చెప్పారు. మహానేత జీవించి ఉంటే రాష్ట్రంలో అందరికీ ఇళ్ళొచ్చి ఉండేవన్నారు.  మీరు ఆశీర్వదిస్తే ఆ ఆశను జగనన్న తీరుస్తారని చెప్పారు. ఉచితంగా  చదువుకోవడానికి వీలుగా బ్యాంకు అకౌంట్లోకి నేరుగా డబ్బొస్తుందని తెలిపారు. వృద్ధులకీ, వితంతులకీ, వికలాంగులకీ పింఛను పెరుగుతుందన్నారు. ఇప్పుడు ఉన్న పింఛన్లను తీసేస్తున్నారని చెప్పారు.  మహబూబ్‌నగర్ ఎంపీ కేసీఆర్ ఏనాడూ ప్రజా సమస్యలపై పోరాడలేదని శ్రీమతి షర్మిల చెప్పారు.

Back to Top