జగన్ ఆయుధం ఇచ్చిన మాట నెరవేర్చడం

హైద‌రాబాద్‌: ఆడిన మాట తప్పలేదు హరిశ్చంద్రుడు. ఫలితంగా అష్టకష్టాలూ పడ్డాడు. అంతిమ విజయం ఆయననే వరించింది. నల్లకాలువ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం చాలామందికి నచ్చలేదు. ఫలితంగానే ఈ కుట్రలు.. కుయుక్తులు.. వైయస్ మరణంతో ఆత్మీయ ఆసరా కోల్పోయి వివిలలాడుతున్న తెలుగు జాతి యావత్తు విలవిల్లాడింది. తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఓదార్చటం కనీస ధర్మంగా భావించారు జగన్.  ఇచ్చిన మాట కోసం ఓదార్పుయాత్రను ప్రారంభించారు. వైఎస్ 2003లో ప్రజాప్రస్థానం ప్రారంభించిన రోజు గుర్తుగా 2010 ఏప్రిల్ 9న ఓదార్పుయాత్ర ప్రారంభించారు. గత మే నెల 27న విచారణ పేరుతో పిలిచి జగన్‌ను సీబీఐ అరెస్టు చేసే నాటికి ఆయన గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తూ ప్రజల మధ్యనే ఉన్నారు. ఇప్పటివరకు 13 జిల్లాల్లో ఓదార్పుయాత్ర పూర్తిచేశారు. ఉభయ గోదావరి, ఖమ్మం, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, విజయనగరం, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 200 రోజులకు పైగా పర్యటించారు. 17,462 కి.మీ. మేర ప్రయాణించి 2,500 సభల్లో ప్రసంగించారు. ఈ జిల్లాల్లో 5,124 ఊళ్ల (120 వరకు పట్టణాలు కలిపి)లో ప్రజలను పలకరించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన 494 మంది కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి ఓదార్చారు.

Back to Top