ప్రజలకు మేలు జరగాలంటే జననేత సీఎం కావాలి

కాకినాడ: రాష్ట్ర ప్రజలకు మంచి మేలు జరగాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పార్టీ సీనియర్‌ నేత రెహ్మాన్‌ అన్నారు. కాకినాడలో వంచనపై గర్జన సభలో రెహ్మాన్‌ పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు సైకిల్‌కు దశా, దిశ లేదని, ఆంధ్రరాష్ట్ర ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకొని తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నాడని మండిపడ్డారు. తిత్లీ తుపాన్‌తో ప్రజలు అల్లాడుతుంటే బాధితులను పట్టించుకోవడం లేదని, తుపాన్‌ బాధితులందరికీ న్యాయం చేసినట్లుగా వందల కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నాడన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో అనైతిక పొత్తుపెట్టుకొని వందల కోట్లు ఆంధ్రరాష్ట్రం నుంచి తరలిస్తున్నాడన్నారు. దయచేసి ప్రజలంతా ఆలోచన చేయాలని, మోసకారి చంద్రబాబును తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. 
Back to Top