హైదరాబాద్ః జగన్ రైజర్స్ స్టేట్ యూత్ అసోషియేషన్ కు చెందిన వేలగపుడి కుమార్ ,జగన్ రైజర్స్ ఒంగోలు జిల్లా కోఆర్డినేటర్ పత్తిపాటి నర్సింగరావు, జగన్ రైజర్స్ కందుకూరు కన్వీనర్ షేక్ సుల్తాన్, జగన్ రైజర్స్ సభ్యులు పార్టీ అధినేత వైయస్ జగన్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. జగన్ రైజర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి అధినేతకు వివరించారు. ఈ సందర్భంగా జగన్ అన్న అభినందించి ఇంకా బాగా పని చేయమని చెప్పారని యూత్ టీఎం తెలిపింది. జగన్ రైజర్స్ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని వైయస్ జగన్ ప్రశంసించారని పేర్కొన్నారు. చాము చేస్తున్న కార్యక్రమాలకి తన వంతు సహాయ సహకారాలు, పార్టీ అండ దండలు ఎప్పుడూ ఉంటాయని వైయస్ జగన్ దీవించారని యూత్ సభ్యులు చెప్పారు. <br/><br/>