జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా నిరూపించుకుంటారు

నెల్లూరు, 15 సెప్టెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా
నిరూపించుకుని తీరతారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం
చేశారు. జగన్‌ను సీబీఐ కుట్రపూరితంగా
కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా
త్వరలోనే జైలు నుంచి బయటికి వచ్చి, ప్రజా
సమస్యలపై పోరాటం కొనసాగిస్తారని మేకపాటి విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ ఆస్తులపై సీబీఐ పూటకో మాట మాట్లాడుతోందని టీడీపీ పొరపాటున నిజం చెప్పినా
ప్రజలు నమ్మే‌ స్థితిలో లేరని ఆయన శనివారం ఇక్కడ అన్నారు.

Back to Top