పిరికి చర్యలకు నిదర్శనం..

వైయస్‌ఆర్‌ జిల్లాః వైయస్‌ఆర్‌సీపీలో చేరికలను అడ్డుకునే మంతి ఆదినారాయణ రెడ్డి పోలీసులతో  కుట్రలు పన్నుతున్నారని  మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. పోలీసులతో అరెస్ట్‌లు చేయడం  సమంజసం కాదన్నారు. మంత్రి   పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంత్రి చేతకానితనానికి ఇది నిదర్శనమన్నారు.ఆదినారాయణ రెడ్డి పులివెందుల వచ్చి స్వేచ్ఛగా తిరిగారని, అప్పుడు వైయస్‌ఆర్‌సీపీ నేతలు విజ్ఞతతో వ్యవహరించారన్నారు. మంత్రి ఆది నారాయణరెడ్డి రౌడీయిజం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. తన పట్టు తగ్గుంతోందనే హౌస్‌ అరెస్ట్‌లు చేయించారని ఆరోపించారు.
 

Back to Top