-పిట్టలదొర మాటలు నమ్మి మోసపోవద్దు
- బాబు రెండేళ్ల కాలంలో గిరిజనులకు చేసింది శూన్యం
- బాబు విశాఖ జిల్లా పర్యటన బాక్సైట్ నిక్షేపాల కోసమే
- మన్యం వీరుడు పుట్టిన గడ్డను బాబు మోసం చేయలేరు...
-వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం: దత్తత తీసుకున్న గ్రామానికే ఏమీ చేయలేని పిట్టలదొర చంద్రబాబు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. బాబు మాటలు నమ్మి గిరిజనులు మోసపోవద్దని సూచించారు. స్థానికంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... విశాఖ పర్యటనలో ఎవరి వనరులను వారు వినియోగించుకోవాలన్న బాబు మాటలు బాక్సైట్ నిక్షేపాల కోసమేనన్నారు. ఆంధ్ర ఊటిని లూటీ చేయడానికే బాబు పర్యటన అని నిప్పులు చెరిగారు. మన్యం వీరుడు అల్లూరి సీతరామరాజు పుట్టిన గడ్డను చంద్రబాబు మోసం చేయాలనుకోవడం బాబు అమాయకత్వామన్నారు. బాక్సైట్ నిక్షేపాలను కాపాడడం కోసం వైయస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...!
* గిరిజనులపై చంద్రబాబు సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారు.
* చంద్రబాబు దత్తత తీసుకున్న గ్రామానికి నేటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు
* ఇంటింటికీ తాగునీరు, గ్యాస్ కనెక్షన్, నెట్ కనెక్షన్ అని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు
* ఆ ప్రాంతానికి న్యూస్ పేపర్ సైతం ఒక రోజు లేటుగా వెళ్తుంది... అలాంటిది ఇంటింటికి ఇంటర్నెట్ ఎలా ఇస్తారు
* విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ అన్న విషయం బాబు గుర్తుంచుకోవాలి
* మన్యం ప్రజలను మోసం చేయాలనుకోవడం చంద్రబాబు అమాయకత్వానికి నిదర్శనం
* రెండేళ్ల పాలనలో బాబు విశాఖ జిల్లాకు చేసిందీ ఏమీలేదు
* గిరిజనులకు మాయమాటలు చెప్పి అక్కడున్న బాక్సైట్ నిక్షేపాలను కొల్లగొట్టడమే బాబు ఆలోచన పర్వం
* ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు
* 50యేళ్లు నిండిన గిరిజనులకు రూ. వెయ్యి పింఛన్ మంజూరు అని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు దానిని అమలు చేయలేదు
* గిరిజన పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య, పక్కా ఇళ్లు, రెండెకరాల భూమి, గిరిజనుల అమ్మాయిల వివాహాలకు రూ. 50వేలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు.
* ఇందులో ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేకపోయారు
* హుద్‌హుద్ తూపానులో బలైన గ్రామానికి బాబు ఏమీ చేయలేదు
* తన పార్టీలో ఒక్క గిరిజనుడిని కూడా మంత్రిగా చేయలేని చంద్రబాబు గిరిజనులకు ఏం చేస్తారు.
* బాక్సైట్ నిక్షేపాలను కాపాడుకోవడం కోసం వైయస్సార్‌సీపీ నిరంతరం శ్రమిస్తుంది.
* చంద్రబాబు పిట్టలదొర...ఆయన చెప్పిన మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దు