టీడీపీది దళితతేజం కాదు.. దళిత మోసం

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నిర్వహించేది దళిత తేజం కాదు.. దళితమోసమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు సంజీవయ్య అని విమర్శించారు. దళితులంటే చంద్రబాబుకు చిన్న చూపు అని పలు సందర్భాల్లో నిరూపితమైందన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే హక్కులేదన్నారు. నెల్లూరు జిల్లాలోనే 80 ఎస్సీ వసతి గృహాలను మూసివేయించిన ఘనత చంద్రబాబుదన్నారు. దళిత విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కొత్తగా ఒక్క గురుకుల పాఠశాలనైనా ప్రారంభించారా అని ప్రశ్నించారు. వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే దళితులంతా ఉన్నారని, ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Back to Top