వైయస్సార్సీపీని ఆహ్వానించాలని ఉత్తర్వులు

హైదరాబాద్:

 అఖిలపక్ష సమావేశాలకు వైయస్ఆర్సీపీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలపునర్విభజన అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ వైయస్ఆర్సీపీని ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీనేత శివకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. శివకుమార్ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ తీరుకు నిరసనగా కొద్ది రోజుల క్రితం  తెలంగాణ వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. కేసీఆర్ నిరంకుశ విధానాలపై నేతలు మండిపడ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top