ఇంత అసమర్థ ప్రతిపక్షనేతను చూడలేదు

హైదరాబాద్ 08 మార్చి 2013:

ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు నాయుడుకు ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవిశ్వాసం పెట్టకపోతే ప్రజలే ఆయనకు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆయన సాగిస్తున్న మీ కోసం వస్తున్నా పాదయాత్రలో ఓ కార్యకర్త అవిశ్వాసం గురించి నిలదీసిన విషయం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. బాబు శాశ్వతంగా శాసన సభకు రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని ఆయన చెప్పారు. ఇంత అసమర్థమైన ప్రతిపక్ష నేతను ప్రజలు ఇంతవరకూ చూడలేదని తెలిపారు. విలేకరుల సమావేశం పూర్తి పాఠం..

     'ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత తీరు చూసి ప్రజలు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. శాసన సభలో బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాడట. అంతేకాదు.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడట.. కానీ ముదినేపల్లిలో సమావేశం ఏర్పాటుచేసుకుని బ్రదర్ అనిల్ కుమార్‌పై మాత్రం చర్చిస్తాడట. 30 ఏళ్ళ వయసున్న పార్టీలో తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాయకత్వంలో పార్టీ పనిచేయాల్సిన తీరిదేనా అని ప్రశ్నిస్తున్నా. అవిశ్వాస తీర్మానం పెట్టమని కోరితే వైయస్ఆర్ సీపీ చెబితే నే పెడతానా అని అడుగుతున్నారు. వైయస్ఆర్సీపీ చెబితే పెట్టద్దు కానీ.. నువ్వు చేపట్టిన మీకోసం వస్తున్నా పాదయాత్రలో ప్రజలు నిన్ను అవిశ్వాసం గురించి అడిగారా లేదా! కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్ఆ మంగళగిరిలోకి పాదయాత్ర ప్రవేశిస్తున్నప్పుడు నీతో నడుస్తున్న వ్యక్తి ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టవు అని ప్రశ్నించాడా లేదా అని అడుగుతున్నా. ముదినేపల్లిలో మొన్న రాత్రి ఏర్పాటుచేసుకున్న సమావేశంలో ఈ ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వమని ప్రతిపక్ష నాయకుడు ఆవేశంగా ప్రసంగించారు.  కిరణ్ దగాకోరు ముఖ్యమంత్రి అని కూడా అన్నారు. సరిగ్గా పాలించడం లేదని అంటున్నప్పుడు అక్కడున్న విద్యార్థులు అవిశాస్వసం ఎందుకు ప్రవేశపెట్టవని ప్రశ్నించారా లేదా అని అడుగుతున్నా. మేం చెప్పినా.. ప్రజలు చెప్పిన అవిశ్వాసం పెట్టని నువ్వు కాంగ్రెస్ చెబితే మాత్రం వెంటనే ఆ పని చేస్తావు. సరైనా సమయంలో పెడతానని చెబుతుండడం వెనుక కాంగ్రెస్ ఉందని కచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామంటూ మాటిమాటికి చెప్పేది కాంగ్రెస్ పార్టీనే. ఈ డైలాగ్ బట్టే ప్రధాన ప్రతిపక్ష నేత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెబితే అదే సరైన సమయంగా ఆయన భావిస్తారు. ఇంత దైర్భాగ్యమైన పనికి చంద్రబాబు నాయుడు పూనుకోవడాన్ని మించిన దురదృష్టం మరొకటి లేదు. పాదయాత్ర చేస్తున్నాను కాబట్టి శాసన సభకు రానని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు శాశ్వతంగా సభకు రాకుండా అవసరమైన ఏర్పాట్లను ప్రజలు చేస్తున్నారు. ప్రజలే అవిశ్వాస తీర్మానం పెడతారని ఆయన చెబుతున్నారు. ఎన్నికలొచ్చినప్పుడే వారు అవిశ్వాసం తీర్మానం పెడతారనే విషయం చంద్రబాబుకు తెలీదా? అవిశ్వాస తీర్మానం పె డితే వైయస్ఆర్సీపీకి లాభమంటున్నారు.. ఎప్పుడు లాభం చేకూరింది మా పార్టీకి అని ప్రశ్నించారు. కిందటి సారి ఆయన అవిశ్వాసం పెట్టినపుడు అసెంబ్లీలో 17 మంది అనుకూలంగా నిలబడ్డారు. అప్పుడొచ్చిన ఎన్నికలలో  15మంది కాంగ్రెస్ పార్టీకి కాకుండా పోయారు. రెండు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా 15 వైయస్ఆర్సీపీ దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేలా అవిశ్వాసం పెట్టను అని కూర్చున్నావంటే ఇంతకంటే దారుణమేముంటుంది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి రహస్య మిత్రుడని నేను అంటుంటే ప్రజలు మాత్రం బహిరంగ మిత్రుడు అయిపోయాడని చర్చించుకుంటున్నారు. ఆపద వచ్చినపుడు ఢిల్లీ వెళ్ళి చీకట్లో కాంగ్రెస్ అధిష్ఠానం కాళ్ళు పట్టుకున్న సంగతి తెలియదనుకుంటున్నారా. కర్ణాటక వెళ్ళి భాజపాతో ఒప్పందం కదుర్చుకున్న చంద్రబాబు ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం పెడితే చీకట్లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించనట్లవుందనే భయంతోనే ఆయన అవిశ్వాసానికి వెనుకాడుతున్నారు. తప్పించుకుంటున్నారు. అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోతుందా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పడిపోతుందా లేదా అనే ప్రశ్న పక్కన పెడితే ప్రజల సమస్యలను చర్చించాల్సిన సమయం ఆసన్నమైనపుడు తప్పదు. గుక్కెడు నీళ్ళు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. డబ్బుకోసం కిడ్నీలు అమ్ముకుంటున్నారు. కరెంటు లేక విద్యార్థులు విలవిలలాడుతున్నారు. ఇలా ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తన్న తరుణంలో అవిశ్వాసం పెట్టకపోతే ఎలా. ఇంత అసమర్థుడైన ప్రతిపక్ష నేతను ఇంతవరకూ చూడలేదు. ఇకపై చూడబోము. గత పార్లమెంటు సమావేశాల్లో ఎఫ్‌డిఐ బిల్లును ప్రవేశపెట్టినపుడు ముగ్గురు రాజ్యసభ ఎంపీలను సభకు హాజరుకాకుండా చేసి కాంగ్రెస్ పార్టీని పెద్దమనిషి చంద్రబాబు. పిల్ల కాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్ అని చేస్తున్న విమర్శలను కట్టిపెట్లాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఆయనే తప్ప మేమే కాదు. అవిశ్వాసం పెడితే జగన్మోహన్ రెడ్డిగారు బెయిలు కోసం బేరమాడతారట. దానికీ, దీనికీ సంబంధమేమిటో చెప్పాల్సిన అవసరం తెలుగు దేశం పార్టీ నాయకులకి ఉంది. ఈ వాదన సరికాదు. ఇప్పటికైనా చంద్రబాబుకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసముంటే తక్షణం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరముంది.'

Back to Top