ఇది ముమ్మాటికీ జగన్‌పై కక్ష సాధింపే

కూడేరు:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై ప్రభుత్వం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని పార్టీ సీఈసీ సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి, కిసాన్ సెల్, అనంతపురం జిల్లాల సమన్వయకర్త  వై. మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు, సీబీఐ పక్షపాత ధోరణిని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణను కూడేరులో మంగళవారం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మహిళలు, వృద్ధులు, వికలాంగులు సైతం స్వచ్ఛందంగా తరలి వచ్చి సంతకాలు చేశారు. జననేత బయటకొచ్చి ఓదార్పు యాత్ర కొనసాగిస్తే తమకు పుట్టగతులుండవని కాంగ్రెస్, టీడీపీ భయపడుతున్నాయని చెప్పారు. అందువల్లే ఆయనకు బెయిల్ రాకుండా సీబీఐని అడ్డుపెట్టుకుని అనేక కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. శ్రీ జగన్‌పై ప్రజలకు విపరీతమైన అభిమానం ఉందన్నారు. ఆయన జైలు నుంచి బయటకు రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు.  కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా జననేత రాజకీయ ఎదుగుదలను అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

Back to Top