ఇది దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం

విజయవాడ, 29 మార్చి 2013: 

సమస్యలు చెప్పుకుందామంటే పట్టించుకునే నేతలే లేకపోయారని విజయవాడకు చెందిన మహిళలు మండిపడ్డారు. ఇది దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యమని వారు ధ్వజమెత్తారు. రాజన్న రాజ్యం కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నోసార్లు తమ సమస్యలను చెప్పుకుందామని ప్రయత్నించానని వెంకటలక్ష్మి తెలిపారు. విదేశీ పర్యటనలు, ఏసీ గదుల్లో కాలం గడిపే నాయకులు తమకేమీ చేయరని తేలిపోయిందని పేర్కొన్నారు. దివంగత మహానేత కుటుంబం ఆదినుంచి మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిందన్నారు. వారికి ప్రజల కష్టనష్టాలు క్షుణ్ణంగా తెలుసని చెప్పారు. మహానేత మరణానంతరం ఆయన సతీమణి శ్రీమతి విజయమ్మ ప్రజలకు తల్లిలా వ్యవహరిస్తున్నారని ఆమె ప్రశంసించారు. దొంగల రాజ్యాన్ని పారదోలి రాజన్న రాజ్యాన్ని నెలకొల్పే సత్తా ఉన్న  మన దొర శ్రీ జగన్మోహన్ రెడ్డిగారికే ఉందని అంజలీదేవి స్పష్టంచేశారు. పులి బోనులో ఉన్నా బయట ఉన్నా పులేనని చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి విడుదల కోసం తామంతా ఎదురుచూస్తున్నామని తెలిపారు. శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను విజయవంత చేసేందుకు మేమంతా కంకణం కట్టుకున్నామని ఆమె చెప్పారు. ఇలాఉండగా.. 105వ రోజు పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల వెంట నడవడానికి విజయవాడకు చెందిన వయోవృద్ధులు కూడా పోటీపడ్డారు. మహిళలు ఆమెతో చేయి కలిపేందుకు ఆరాటపడ్డారు. శ్రీమతి షర్మిల చిన్న పిల్లలను ఎత్తుకుంటూ ఆప్యాయంగా ముద్దాడుతూ.. ముందుకు సాగారు.

Back to Top