జననేతకు జన నీరాజనం

ఓం కారం గ్రామంలో వైయస్ జగన్ పర్యటన
సిద్దేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు
అనంతరం గ్రామ ప్రజలతో భేటీ
ఉదయం లింగాపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

కర్నూలుః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర జిల్లాలో ఐదవరోజు కొనసాగుతోంది. వైయస్ జగన్ కు గ్రామగ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ వైయస్ జగన్ వారిలో ధైర్యం నింపుతున్నారు. కాసేపటి క్రితమే వైయస్ జగన్ ఓం కారం గ్రామంలో పర్యటించారు. సిద్ధేశ్వరస్వామి ఆలయంలో వైయస్ జగన్ కు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఓం కారం ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం వైయస్ జగన్ గ్రామ ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధినేత వెంట పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులున్నారు.  

అంతకుముందు బండి ఆత్మకూరు మండలం లింగాపురం నుంచి వైయస్ జగన్ అయిదో రోజు భరోసా యాత్రను ప్రారంభించారు. లింగాపురం చర్చిలో వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లింగాపురం నుంచి ఓంకారం, కడమల కాల్వ, వెంగళరెడ్డిపేట వరకూ రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం బి.కోడూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చాంద్‌బాషా కుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్‌ షో వెంగళరెడ్డి పేట నుంచి నేరుగా పుట్టుపల్లె, అబ్బీపురం మీదగా మండలం కేంద్రమైన ఎం.తిమ్మాపురం చేరుకుంటుంది. అక్కడ దూదేకుల చిన్నస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బుక్కాపురం వరకూ రోడ్‌ షో చేపడతారు.

తాజా వీడియోలు

Back to Top