గన్నవరం ఎయిర్ పోర్టులో జననేతకు ఘనస్వాగతం

హైదరాబాద్‌: వైయస్ జగన్ రైతు దీక్షకు రాష్ట్ర ప్రజానీకం పోటెత్తారు. అంతకుముందు గన్నవవరం విమానాశ‍్రయం చేరుకున్న వైయస్  జగన్‌ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైయస్‌ జగన్‌ నేటి నుంచి రెండు రోజులపాటు గుంటూరులో ‘రైతు దీక్ష’ చేస్తున్నారు. దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన వైఎయస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వంగవీటి రాధా, వెల్లంపల్లి శ్రీనివాస్‌, లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరావు, తోట శ్రీనివాస్‌ తదితరులు అధినేతకు ఘనస్వాగతం పలికారు.అక్కడ నుంచి గుంటూరు బయలుదేరిన వైయస్‌ జగన్‌.. బస్టాండ్ వద్ద మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం సర్దార్‌ కాసు వెంగళరెడ్డి విగ్రహానికి  నివాళులర్పించారు

Back to Top