రైల్వే జోన్ సాధ‌న‌కు అమ‌ర్‌నాథ్ పాద‌యాత్ర‌

విశాఖ‌: విశాఖపట్టణం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పాద‌యాత్ర ప్రారంభించారు.గురువారం అన‌కప‌ల్లిలోని నెహ్రూ సెంట‌ర్ నుంచి ‘ఆత్మగౌరవ యాత్ర’ను పార్టీ సీనియ‌ర్ నేత‌లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, అంబ‌టి రాంబాబు ప్రారంభించారు. అనకాపల్లి నుంచి ప్రారంభం కానున్న యాత్ర జిల్లాలో మొత్తం 162 కిలోమీటర్ల మేర సాగనుంది. అన్ని వర్గాలను కలిసి రైల్వేజోన్ ఆవశ్యకతపై నాయకులు వివరించనున్నారు. 11 రోజులపాటు సాగే ఈ యాత్ర చివరి రోజు బోయిపాలెం, దొరతోట, భీమిలి మీదుగా సాగి చిట్టివలసలో ముగుస్తుంది.

Back to Top