కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 17వ రోజు వెల్దుర్తి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, తదితరులు వైయస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు తమ బాధలు వైయస్ జగన్‌కు చెప్పుకున్నారు.