గోవిందరెడ్డి వైద్యసేవలు మరువలేనివి

ముండ్లపాడు(పెనుగంచిప్రోలు): గోవిందరెడ్డి గ్రామంలో పశువులకు చేసిన వైద్య సేవలను రైతులు ఎవరూ మరువలేరని మాజీ ఎంపీపీ, నియోజకవర్గ  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గూడపాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఇటీవలన మరణించిన గ్రామ పశువైద్యశాల ఉద్యోగి ఆళ్ల గోవిందరెడ్డి సంతాపసభ సోమవారం గ్రామంలో నిర్వహించారు. ఈసందర్భంగా గూడపాటి మాట్లాడుతూ... పెద్దగా చదువుకోక పోయినా గోవిందరెడ్డి పశువులకు మంచి వైద్యం చేసేవారన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా రైతుల నుండి మంచిపేరు సంపాదించుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గుంటుపల్లి వాసు, గూడపాటి చెన్నకేశవులు, గ్రామపెద్దలు చండ్రుపట్ల లక్ష్మీనరసింహారావు, నాగిరెడ్డి, కూచి మోహనరావు, కొత్తగుండ్ల వెంకటేశ్వర్లు, పశువైద్యాశాల సిబ్బంది చిట్టిబాబు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

Back to Top