హైదరాబాద్ః బీఏసీ సమావేశం ముగిసింది. అవిశ్వాస తీర్మానంపై ఇవాళే చర్చిస్తామని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పార్టీలో అనైతికంగా చేర్చుకున్న ఎమ్మెల్యేలను రక్షించడం కోసమే , ప్రభుత్వం ఈరకమైన చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే..ఉన్నపళంగా ఇప్పుడే చర్చిద్దామనడం దారుణమన్నారు. సభకు రానివాళ్లకు చెప్పేందుకు అవకాశం కూడా ఇవ్వకపోవడం హేయనీయమన్నారు. సభ్యులను బలవంతంగా లాక్కొని ప్రలోభపెట్టిన ప్రభుత్వ నీచ పనులను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఈరకంగా తప్పించుకునే కుట్రలు, కుతంత్రాలు చేయడాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను అన్ని రకాలుగా కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. <br/>