వరంగల్: తెలంగాణ విమోచన దినాన్ని కేసీఆర్ విమోచన దినంగా పాటించారు. వరంగల్ జిల్లా గీసుగొండలో కొండా మురళీ, సురేఖ దంపతుల ఆధ్వర్యంలో ఈ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. 5వేల మందితో భారీగా కేసీఆర్ శవయాత్ర నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణను తీసుకువచ్చి గాంధీ అవుతారో, డబ్బులకు అమ్ముడుపోయి తెలంగాణ హీనుడవుతారో ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని కొండా దంపతులు అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తెలంగాణపై చిత్తశుద్ధితో కృషిచేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని ఒప్పించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకువస్తామని చెప్పారు.