టిడిపి కాకిగోలకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ బెదరదు

మెదక్, 10 జూలై 2013:

టిడిపి నాయకుల కాకిగోలకు తమ పార్టీ బెదిరిపోయే ప్రసక్తే లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి ఓ పిల్లకాకి అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ రెండు తలల పాము కాదని, మూడు తలల విషపు నాగు అని గట్టు అభివర్ణించారు. కేవలం రాజకీయం ఉనికి కోసమే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి టిడిపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

Back to Top