గాలికొదిలిన గిరిజన సంక్షేమం..

మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ప్రజలను కష్టాలోకి నెట్టారు..
చంద్రబాబు పాలనపై వైయస్‌ఆర్‌సీపీ నేతల ఆగ్రహం..
విజయనగరంః రాష్ట్రంలో ఉన్న బడుగు,బలహీనవర్గాలు తీవ్ర ఇబ్బందులు,కష్టాలు ఎదుర్కొంటున్నారని సాలూరు నియోజకవర్గానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో గద్దె నెక్కి ప్రజలను కష్టాల్లోకి నెట్టారని మండిపడ్డారు. గిరిజనులందరూ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. గిరిజనులకు  పింఛన్లు,రేషను,గృహాలు లేని పరిస్థితి వుందన్నారు. రాజన్న రాజ్యంలోని సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.ఏజెన్సీలో విషజ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడుతున్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌ ముందుకొచ్చి రాజీనామాకు సిద్ధమైతే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కదలిక వచ్చి తూతూమంత్రంగా చర్యలు చేపట్టిందన్నారు. ఒరిస్సా,ఆంధ్రలకు చెందిన 22 ఉమ్మడి వివాదస్పద గ్రామాలు ఉన్నాయని గతంలో వైయస్‌ఆర్‌సీపీ బృందం ఆ గ్రామాల్లో సందర్శించామని అక్కడ గిరిజనులు ఒరిస్సా ప్రభుత్వం అందించిన సౌకర్యాలు గురించి చెప్పారే తప్ప టీడీపీ ప్రభుత్వం కనీసం సౌకర్యాలు కూడా అందించలేదని గిరిజనులు చెప్పారన్నారు.దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో అందించిన సంక్షేమ పథకాలే తప్ప నేడు గిరిజనులకు ఏవిధమైన సంక్షేమం అందడంలేదన్నారు. సాలూరు మున్సిపాల్టీలో కూడా ఆసుప్రతిలో సరైన సౌకర్యాలు లేవన్నారు. వంద పడకలు ఆసుప్రతి నిర్మిస్తామని గత ఐదు సంవత్సరాలుగా హామీలే తప్ప ఇప్పటివరుకూ జరగలేదన్నారు. సాలూరులో ఆరోగ్యపరంగా చూస్తే చాలా అధ్వాన్నంగా ఉందన్నారు.రోగాలు ముసురుకుంటున్నా పట్టించుకునే నాయకుడు లేడరన్నారు. విషజ్వరాలు వ్యాపిస్తే  వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రాజన్నదొర సొంత నిధులు ఖర్చుపెట్టి వైద్యం చేయించారన్నారు.వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయితే సాలూరు ఆసుప్రతిని వందపడకల ఆసుప్రతిగా అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు.

Back to Top