దుర్మార్గంగా హౌస్ నడిపిస్తున్నారు

అజెండాలో లేని అంబేద్కర్ ఇష్యూ తెరపైకి తెచ్చి..
కాల్ మనీ పై చర్చకు అడ్డుపడుతున్నారు
15 ప్రధాన అంశాలపై చర్చిద్దామని చెప్పాం
సమావేశాలు పొడిగించాలని అడిగాం
దేనికి ఒప్పుకోకుండా తప్పించుకుంటున్నారు
ప్రభుత్వంపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్ 

అసెంబ్లీః అసెంబ్లీలో అధికారపక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. దౌర్భాగ్యంగా చంద్రబాబు సభను నడిపిస్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సభలో సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఎంతో ఆశగా చూశారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రైతులు, నిరుద్యోగులు, అంగన్ వాడీ వర్కర్లు సహా ఎంతోమంది తమ వద్దకు వచ్చి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయమని అడిగారన్నారు. కానీ, అధికారపక్షం సభ్యులు చర్చ జరగకుండా అడ్డుపడుతూ  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. 

రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని సమావేశాలను పొడిగించాలని బీఏసీలో అడిగితే ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు.  బీఏసీకి ముందే మంత్రులు బయట ఐదు రోజుల సమావేశాలని చెప్పారు. ఉన్న ఐదు రోజుల్లోనైనా తాము 15 ప్రధాన అంశాలపై చర్చించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి సమక్షంలో స్పీకర్ ను కోరామన్నారు శ్రీకాంత్ రెడ్డి . అన్ని ఫార్మాట్లలో ఇవ్వండి టైమింగ్ ఏర్పాటు చేసే బాధ్యత తనదని చెప్పి తమను ఇంతవరకు పిలవలేదన్నారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయం ప్రధానాంశం కాబట్టి మొదటి ప్రాధాన్యతగా దానిపై చర్చిద్దామని చెప్పాం. మహనీయుడు అంబేద్కర్ గారించి మాట్లాడుదామని చెప్పినా కూడా పట్టించుకోలేదు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చిద్దామంటే దానికి సమాధానం చెప్పకుండా .. అజెండాలోలేని అంబేద్కర్ ఇష్యూని తెరపైకి తెచ్చి చర్చను అడ్డుకుంటున్నారు. పైగా బీఏసీలో సభ్యులు చర్చకు ఒప్పుకోవడం లేదంటూ  అబద్ధాలు ఆడుతున్నారు. మహిళ అని కూడా చూడకుండా అవమానకరరీతిలో రోజాను సస్పెండ్ చేయడమే గాకుండా అనారోగ్యంతో ఉన్న ఆమెను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. అంగన్ వాడీలను ఈడ్చుకెళుతున్నారు. కాల్ మనీ పేరుతో మహిళల మాన ప్రాణాలతో ఆటలాడుతున్నారు. మహిళల పట్ల  ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని శ్రీకాంత్ రెడ్డి పైరయ్యారు. 

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలను చర్చించాలని మేం భావిస్తే సస్పెండ్ చేయమే మా విధానం అన్నట్లు అధికారపక్ష సభ్యులు ప్రవర్తిస్తున్నారన్నారు.  సస్పెండ్ చేసిన విధానం సరికాదని లెటర్ ఇవ్వమంటే మేం ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండంటారు. హౌస్ సుప్రీం మా ఇష్టమొచ్చినట్లు చేస్తామంటారు. ఈరకంగా చేస్తే ప్రజాస్వామ్యంపై విలువలేముంటాయని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.  రూల్ బుక్ కూడ పక్కనపడేయండి మేం చెప్పిందే రూల్ అంటున్నారంటే వారిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఎదురుదాడే తమ సిద్ధాంతం అన్నట్లుగా సభలో ఇలాంటి  విధానాలు అవలంభిస్తున్నారు. ఏదో రకంగా ప్రజాసమస్యలను చర్చించమంటే పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇలా చేస్తే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని శ్రీకాంత్ రెడ్డి  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్, వ్యవసాయం రైతాంగ సమస్యలు, కరవు, వరదలు,  బాక్సైట్ తవ్వకాలు, కల్తీమద్యం మరణాలు, నిరుద్యోగభృతి, ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ సహా అనేక అంశాలు చర్చించాల్సింది ఉందని చెప్పాం. ఏపీపీఎస్సీ ఒక్క జాబ్ లేదని చెబుతోంది. ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. వయసు పైబడుతుండడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు . త్వరగా నిర్ణయం తీసుకోండంటే పట్టించుకోవడం లేదు. నిత్యవసర ధరలు, కృష్ణా మిగులు జలాల విషయంలో, ప్రాజెక్ట్ ల పేరుతో అవినీతి వీటన్నంటిపై చర్చ జరుపుదాం రమ్మంటే రావడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమవుతోందని నోటీసులిచ్చాం. ఇసుకమాఫియాపై చర్చకు  నోటిసిచ్చాం. ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్ లో మా సభ్యులు ఒకరోజంతా పోరాడారు. దీనిపైనా నోటీసులిచ్చాం. వివిధ ఫార్మాట్లలో చర్చకు నోటీసులిచ్చానా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యూట్టారు. 

తాజా వీడియోలు

Back to Top