ఓర్వలేకే ప్లెక్సీలు ధ్వంసం..

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంత్రి  సుజయ్‌ కృష్ణ రంగారావుకు ఓటమి భయం పట్టుకుందని, ఓర్వలేక  వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలను చింపుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఆగడాలు దారుణమన్నారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూసి అసుయ పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి ఫిరాయించి సిగ్గులేకుండా ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారని విమర్శించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు కనీస సౌకర్యాలు కూడా టీడీపీ ప్రభుత్వం కల్పించడలేదన్నారు. ప్రజలు తిరగబడతున్నారనే భయంతో టీడీపీ ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని వెళ్లడంలేదన్నారు. రాష్ట్రంలో అన్నిరంగాల్లో అధికార పార్టీ విఫలమయ్యింది. 
 

తాజా వీడియోలు

Back to Top