ప్ర‌త్యేక హోదా మీద పోరు కొన‌సాగింపు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మీద పోరును ఉధృతం చేస్తామ‌ని వైఎస్సార్సీపీ ప్ర‌క‌టించింది. హోదా రాద‌ని కేంద్రం స్ప‌ష్టం చేయ‌టంతో ఈ నిర్ణ‌యాన్ని వెలువ‌రించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై తాము ఢిల్లీ వీధుల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు లాంటి అసమర్థ సీఎం కారణంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని జోగి రమేష్ విమర్శించారు.ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రమంత్రి ప్రకటనతోనైనా చంద్రబాబు స్పందించాలని అన్నారు.  ఏపీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి బయటకు రావాలని చెప్పారు. 
విజయవాడ కేంద్రంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్న రాజకీయ వ్యభిచారాన్ని పక్కనపెట్టి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సూచించారు. 
Back to Top