ప్లీనరీ తీర్మానాలపై దశలవారీ పోరాటం

సీతంపేట: ప్లీనరీ తీర్మానాలు పరిష్కరించేంతవరకు దశలవారీ పోరాటాలు చేయనున్నట్టు పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు. బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ సీతంపేటలో ప్లీనరీ విజయవంతం చేసిన ప్రతీ వైయస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.సమస్యలన్నింటిని త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి ప్లీనరీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించేంతవరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా ఏనుగుల సమస్య ఉందని, ఏనుగుల వలన పంటలకు నష్టం వాటిల్లిన గిరిజనులకు పంటనష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదన్నారు. కొన్ని గ్రామాలకు రహదారులు వేసినా అవి నాణ్యతా లోపంతో ఉన్నాయన్నారు. విద్య, వైద్య సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు లేవన్నారు. ఇన్‌పుట్‌ సబ్సీడీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీ లేదన్నారు. రోజురోజుకు గిరిజనాభివృద్ది కుంటుపడుతుందన్నారు.

తాజా ఫోటోలు

Back to Top