పోరాటం ఇంతటితో ఆగదు..!

 () హోదాను సాధించేవరకు ఉద్యమిస్తాం

() చంద్రబాబు, బీజేపీ మోసాలు అన్నీ ఇన్నీ కావు

() బాబు రెండేళ్లుగా అవినీతిలో కూరుకొని పోయి హోదాను పక్కన పెట్టారు

() నెల్లూరు యువభేరిలో చైతన్య పరిచిన వైయస్ జగన్

నెల్లూరు)) ప్రత్యేక హోదా సాధించేదాకా పోరాటాన్ని ఆపబోమని, మరింతగా పోరాడతామని
ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ వెల్లడించారు. నెల్లూరు శ్రీ
కస్తూరిదేవి గార్డెన్స్ లో నిర్వహించిన యువభేరి లో ఆయన మాట్లాడారు. వైయస్ జగన్
ఏమన్నారో ఆయన మాట్లలోనే...


() ప్రతీ ఒక్కరూ కూడా హోదామీద ప్రస్తావన చేయాల్సివచ్చినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు ... ప్రతి ఒక్కరి
నోట్లోంచి వచ్చే మాట ఒకటే ఒకటి. అందరం చదువుకుంటున్నాం. కొంతమంది చదువులు అయిపోయి
ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. చాలా మంది చదువుకుంటున్నవారే. చదువు అయిపోయాక
ఉద్యోగాలు కావాలనుకున్న ప్రతీ చేయి పైకి ఎత్తింది. 

() నేను అడిగేదల్లా ఒకటే. చదువులు అయిపోయాక
ఉద్యోగం కావాలన్న నినాదం స్వరం వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు బాబు చెప్పిన
మాటలేమిటి. ఏ టీవీ ఆన్ చేసినా మనకు వినిపించిన మాటేమిటి. ఏగోడమీద రాతలు చూసినా
కనిపించినదేమిటీ. బాబు మైక్ పట్టుకొని మీటింగ్ లలో ఏమాట
మాట్లాడినా..మనకు వినిపించేదిమిటంటే

జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాట వినిపించింది.

() బాబు ముఖ్యమంత్రి అయ్యాడు...మరి జాబులు మనకు వచ్చాయా.

 బాబు సీఎం అయ్యే నాటికి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు లక్షా 42వేల పోస్టులు ఖాళీలున్నాయని లెక్కలు గట్టారు.

() ప్రతీ ఇంటికీ జాబ్ ఇస్తానన్నావ్. ఇవ్వలేకపోతే ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ.2 వేలు అన్నావ్. అవన్నీ ఎక్కడ బాబు

లక్షా 42
వేల ఉద్యోగాలు
వస్తాయని చెప్పడంతో నెలల తరబడి పిల్లలు చదువుకొంటున్నారు. ఏపీపీఎస్సీ  పరీక్షల కోసం సిటీలకు పోయి చదువుతున్నారు. పిల్లలకు ఉద్యోగాలు రావాలని వారి తల్లిదండ్రులు నెలకు రూ.2,3 వడ్డీకి అప్పులు తెచ్చి మరీ చదివిపిస్తున్నారు.

 

చంద్రబాబువి అన్నీ అబద్దాలే..!

() రెండేళ్లుగా పిల్లలు ఉద్యోగాల కోసం చదువుతూనే ఉన్నారు. ఇంతవరకు ఏపీపీఎస్సీ
పరీక్షలు పెట్టిన పాపాన పోలేదు ఈపెద్దమనిషి. ఎప్పుడు పెడతాడో కూడా చెప్పడం లేదు.

పిల్లలు సంవత్సరాల తరబడి చదువుతూనే ఉన్నారు.  కానీ, బాబు మాత్రం పరీక్షలు  పెట్టడం లేదు

డీఎస్సీ పరీక్షలు పెట్టాడు. ఎప్పుడు మెరిట్  లిస్ట్ వస్తుందా అని ఇంకా వారు ఎదురుచూస్తూనే
ఉన్నారు

()   రాష్ట్రానికి హోదా ఇస్తేనే ఉద్యోగాలు వస్తాయని తెలిసి
కూడా బాబు దాన్ని నీరు గారుస్తున్న పరిస్థితి చూస్తే బాధనిపిస్తోంది. 

() ఇదే కాంగ్రెస్ , టీడీపీ,
బీజేపీ
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేటప్పుడు పార్లమెంట్ సాక్షిగా వారు ఏమన్నారంటే.
హైదరాబాద్ నగరం మీ నుంచి పోతుంది కాబట్టి హోదా ఇస్తామని చెప్పారు. 98 శాతం సాఫ్ట్ వేర్, 70 శాతం మానుఫాక్చరింగ్ పరిశ్రమలు హైదరాబాద్ లోనే ఉన్నాయి.  ప్రతీ పిల్లాడు నేరుగా ఉద్యోగం కోసం హైదరాబాద్
కు పోతున్నాడు. కాబట్టి ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారు.  హోదా ఐదేళ్లు సరిపోదు కనీసం
పదేళ్లేయిునా ఇవ్వాలని వెంకయ్యనాయుడు. బాబు సభ్యులంతా ఆనాడు కోరారు.

() రాష్ట్రాన్ని విడగొట్టాక కూడా టీడీపీ, బీజేపీలు హోదా ఐదేళ్లు కాదు అధికారంలోకి వస్తే
పదేళ్లు చేస్తామని  మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతీ మీటింగ్ లో చెప్పారు. ఆరోజు ఎన్నికలప్పుడు
ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్నారు. ఇవాళ ఎన్నికలయిపోయాక పార్లమెంట్ లో ఆడిన మాటను
నిస్సిగ్గుగా తప్పే కార్యక్రమం చేస్తున్నారు.

 

() హోదా ఇవ్వకపోవడానికి రకరకాల కారణాలు వెతుకున్న వీళ్లకు హోదా వల్ల కలిగే
మేలు తెలుసా అని నేనడుగుతున్నా. హోదా వస్తే ప్రధానంగా రెండు ప్రయోజనాలు జరుగుతాయి.

హోదాతో రెండు ప్రయోజనాలు

() కేంద్రం నుంచి మనకు వచ్చే నిధుల్లో 90 శాంత గ్రాంట్ గా వస్తే 10 శాతం మాత్రమే లోన్ వస్తాయి. లోన్ అయితే
వెనక్కి తిరిగి ఇవ్వాలి, కానీ గ్రాంట్  మాత్రం వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. హోదా
లేక పోతే గ్రాంట్స్ 30
శాతం
మిగిలినదంతా లోన్ కింద ఇస్తారు.

() రెండవ అంశమేంటంటే...

 ప్రత్యేక హోదా గల రాష్ట్రాల్లోని పరిశ్రమలు ఇన్ కం ట్యాక్స్ , ఎక్సైజ్ సుంకం కట్టాల్సిన పనిలేదు. కరెంట్ 50 శాతం సబ్సిడీ దొరుకుతుంది. పరిశ్రమలు
పెట్టేందుకు ముందుకు వస్తే ఉత్పత్తి చేసేదానికి ట్రాన్స పోర్ట్ చార్జెస్ కూడా తిరిగి
వెనక్కి ఇస్తారు. ఇలాంటి బెనిఫిట్స్ ఉంటే  బాబు ఎక్కడకు పోవాల్సిన పని లేదు. చైనా , జపాన్, సింగపూర్, రష్యా పోవాల్సిన పనిలేదు.

()  ఇలాంటి ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ హోదా గల రాష్ట్రాలకు
ఇస్తారు కాబట్టి పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొని వస్తారు. మనకు హోదా వస్తే మన దగ్గర పరిశ్రమలు
పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు  ముందుకు వస్తారు. అప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. వేల
సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. తద్వారా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. హోదా ఎప్పుడైతే మనకిస్తారో ఆరోజు నో వెకెన్సీ
బోర్డులు కనిపించవు. వాంటెడ్ బోర్డులు కనిపిస్తాయి. 

() హోదా మనకొస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతోంది.  హోదా వల్ల  మేలు జరుగుతుందని తెలిసి
కూడా బాబు దగ్గరుండి నీరుగారుస్తున్నాడు. 

బాబు కి కేసుల భయం

() బాబు, మోడీలు ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు

() ఎన్నికలయిపోయాక టోపీలు పెడుతున్నారు. పథకం ప్రకారం బాబు
నీరుగారుస్తున్నాడు. 

తెలంగాణలోఓటుకు నోటు కేసులో ఆడియో వీడియో టేపులతో ఎప్పుడైతో  దొరికాడో ఆరోజే హోదాకు తెరపడింది. మోడీని
గట్టిగా నిలదీసే పరిస్థితి లేదు.

() రెండేళ్లుగా అవినీతిలో కూరుకుపోయిన బాబు మోడీని ప్రశ్నించే పరిస్థితి లేదు.
ప్రశ్నిస్తే మోడీ సీబీఐని రంగంలోకి దింపుతారని బాబుకు భయం. 

() చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే .... ఇచ్చిన మాట
ప్రకారం హోదా ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటామని ఎందుకు అల్టిమేటం
ఇవ్వలేకపోతున్నారు. బాబు అల్టిమేటం ససేమిరా ఇవ్వడు.

() హోదా ఏమైనా సంజీవనా అంటాడు. మరో రోజు హోదా వస్తే అన్నీ జరిగిపోతాయా అంటాడు.
కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని నవ్వుతూ వెటకారం చేస్తాడు. బాబు ఈమాదిరిగా ముఖ్యమంత్రిగా
ఉండి హోదా అవసరం లేదంటున్న తీరు చూసి బీజేపీలో ధైర్యం పెరిగిపోయింది. హోదా మేం ఇవ్వంపో అనే
పరిస్థితిలోకి వెళ్లిపోయారు.

కేంద్రం అంటే బాబుకి భయం

() ఎన్నికలయిపోయాయి కాబట్టి అదే పార్లమెంట్ ను సాక్షిగా చేసుకొని కేంద్రం
హోదాను ఇవ్వబోమని చెబితే బాబుకు అప్పటికీ సిగ్గు రాలేదు. నిలదీయాలన్న ఆలోచన రాలేదు

() జైట్లీ పార్లమెంట్ లో ఆ మాట మాట్లాడినప్పుడు బాబు ప్రెస్ మీట్ పెట్టాడు. కనీసం ఇప్పుడైనా పౌరుషం వస్తుంది బీజేపీకి అల్టిమేటం ఇస్తాడని ఎదురు చూశాం.

() కానీ,
బయటకొచ్చాక ఆయన
మాట్లాడిన మాటలేంటో తెలుసా....హోదా మీరు ఇవ్వకపోయినా కేంద్రంలో కొనసాగుతామని
మాట్లాడుతున్నారు. హోదా ఇవ్వకపోయినా మోడీని తిట్టకండి. పార్లమెట్ లో గొడవ
చేయొద్దని బాబు తన ఎంపీలకు ఉద్బోధ చేస్తున్నాడు

ఇలాంటి ముఖ్యమంత్రి పరిపాలనలో మనకు హోదా వస్తుందా అని అడుగుతున్నా.

() స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసేటప్పుడు బాబు అప్పుడు పుట్టకపోవడం దేశం చేసుకున్న అదృష్టం.
ఒకవేల బాబు అప్పుడుగనుక ఉంటే ..బ్రిటీష్ వాళ్లు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం
అనేవాళ్లు. స్వాతంత్ర్యమేమయినా సంజీవనా అని కూడా అనేవాడు. స్వాతంత్ర్యం ఇవ్వకపోయినా పర్వాలేదనేవాడు.

కొత్త అబద్ధాలు వస్తున్నాయి

() ఆరోజు బాబు పుట్టకపోవడం దేశం చేసుకున్న అదృష్టం. బాబు ముఖ్యమంత్రిగా ఉండడం
మనం చేసుకున్న కర్మ. హోదాకు సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే...14వ ఆర్థికసంఘం ఒప్పుకోవడం లేదని నిస్సిగ్గుగా
అబద్దాలు చెబుతున్నారు

() 14వ ఆర్థికసంఘం ఒప్పుకోలేదు కాబట్టి హోదా ఇవ్వలేదని జైట్లీ చెప్పారు.
() జైరాం రమేష్‌కు 14వ ఆర్థికసంఘం సభ్యుడు రాసిన లేఖలో.. అసలు తాము ప్రత్యేక హోదా ఇవ్వద్దని అననే అనలేదని చెప్పారు
()ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నారా లేదా అని మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటును అడిగారు
దానికి వచ్చిన లిఖిత సమాధానంలో.. ఆ హోదాను ఉపసంహరించుకునే ఆలోచన ఏమీ లేదని తెలిపారు
()ఒకవైపు ప్రత్యేక హోదా కొనసాగిస్తూ, మరోవైపు మీరే 14వ ఆర్థికసంఘం ఇవ్వద్దని చెప్పిందంటారు
ఇలా పొంతన లేకుండా మాట్లాడుతుంటే.. ఇంతమంది కుట్రపన్ని ఒక రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా చూస్తుంటే పార్లమెంటరీ వ్యవస్థను చూసి తలదించుకోవాలనిపిస్తోంది

    మోసం చేసిన వారిని నిలదీయాలి

() రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి, ప్రధాని రేసులో ఉన్నవారు ఓ మాట చెబితే దానిపై
నిలబడాలి. లేకపోతే ప్రజలు నిలదీస్తారన్న భయం రావాలి. అప్పుడే మార్పు వస్తుంది.
మనమంతా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేసిన బాబును,
బీజేపీని  నిలదీయాలి. అప్పుడే మార్పు వస్తుంది.

బాబు
మాటలు హోదాతోనే ఆగిపోలేదు. ఎన్నికలప్పుడు టీవీల్లో, పత్రికల్లో, గోడల మీద, ఇంటింటికీ కరపత్రాల్లో ఎన్నో హామీలను ఊదరగొట్టాడు.

() బేషరుతుగా రుణాలన్నీ మాఫీ కావాలన్నా, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలన్నా, డ్వాక్రా అక్క చెల్లెళ్లకు రుణాలు మాఫీ
కావాలన్నా బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. జాబు రావాలన్నా, నిరుద్యోగ భృతి, ఇళ్లు రావాలన్నా బాబు రావాలన్నాడు. 

() ఇన్ని అబద్ధాలు ఆడిన ఈవ్యక్తిని మనం నిలదీయకపోతే...రేపు పొద్దునే ఇంటింటికీ మూడు కేజీల బంగారం, విమానం, కారు ఇస్తానని నమ్మబలుకుతాడు 

() అబద్ధాలు చెప్పేవాళ్లను, మోసం చేసేవాళ్లను నిలదీయాలి. అది విద్యార్థుల నుంచే మొదలవ్వాలి. ఈపోరాటం
ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో  ఉద్యమాన్ని గట్టిగా కొనసాగిద్దాం. ఈపోరాటాన్ని ఆగిపోకుండా
ముందుకు తీసుకుపోతేనే హోదా అన్నది నిలబడుతోంది. 

() హోదా మన హక్కు అన్నది వాళ్లు మరిచిపోకుండా
ఉండాలి. ప్రతీ ఒక్కరూ ఇందుకు కలిసి రావాలి. అందరం భాగస్వాములం కావాలి. ఒత్తిడి
తీసుకురాకపోతే చేతులు దులుపుకున్నట్లు అవుతుంది. అందరం ఒక్కటైతే సాధించలేనిదేమీ
ఉండదు. 

 

తాజా వీడియోలు

Back to Top