ఊరూరా పండుగ

  • నిరాడంబరంగా వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
  • పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు
  • పేదలకు దుస్తుల పంపిణీ
  • రోగులకు పండ్లు, బ్రెడ్డు అందజేత
  • స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు
  • పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా సంబరాలు
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బుధవారం వైయస్‌ జగన్‌ 44వ  జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి వైయస్‌ జగన్‌ బర్త్‌డే వేడుకలు జరుపుకోగా..రెండు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు వైభవంగా సంబరాలు చేసుకున్నారు. లోటస్‌ పాండ్‌ లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా నేతలు ఆర్కే రోజా, గిడ్డి ఈశ్వరి, లక్ష్మీపార్వతి, వాసిరెడ్డి పద్మ, పార్టీ సీనియర్‌ నేతలు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి పార్థసారధి 44 కేజీల కేక్‌ కట్‌ చేసి వైయస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుత్తా ప్రతాప్‌రెడ్డి సహకారంతో పేద మహిళలకు వెయ్యి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌:
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, అంజాద్‌ బాషా, జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌ రెడ్డి, పార్టీ నేతలు కేక్‌ కట్‌ చేసి వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుక నిర్వహించారు. రాయచోటి ఎమ్మెలే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు పరికరాల పంపిణీ, హన్మంతరెడ్డి ఆధ్వర్యంలో రోగులకు  బ్రెడ్‌ పంపిణీ, పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బద్వేల్‌లో పార్టీ ఇన్‌చార్జ్‌ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్‌ కట్‌ చేసి స్థానికులు స్వీట్లు పంపిణీ చేశారు. పులివెందుల పట్టణంలోని జీసస్‌ అనాథ శరణాలయంలో కమలమ్మ ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ బర్త్‌ డే వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో వైయస్‌ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుక్నురు. బీసీ హాస్టల్‌లో రుఖ్మిణిదేవి పండ్లు పంపిణీ చేశారు. కమలాపురం పట్టణంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.  రైల్వే కోడురులో 44 కేజీల కేక్‌ను పార్టీ నాయకులు సుకుమార్‌రెడ్డి కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతపురం: జిల్లాలో వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు శంకర్‌ నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్‌ రెడ్డి, తదితరులు ఘనంగా పార్టీ అధినేత పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. విద్యార్థి విభాగం నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

చిత్తూరు: ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు జిల్లాలో అట్టహాసంగా నిర్వహించారు. తిరుపతిలోని నిండ్ర షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద వెంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి చక్రపాణిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేకపూజలు చేసి, ఆస్పత్రిలో పేషెంట్లకు బ్రెడ్డు, పాలు పంపిణీ చేశారు. వైయస్‌ఆర్‌‡సీపీ విద్యార్థి విభాగం నాయకుడు హరిప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టేకులపల్లి మండల వైయస్‌ఆర్‌æ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా వైయస్‌ఆర్‌æ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్‌ కట్‌ చేశారు. 

కర్నూలు: జిల్లాలోని వైయస్‌ఆర్‌ స్మృతివనం వద్ద శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆత్మకూరు పట్టణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య, ఇన్‌చార్జ్‌ హఫీజ్‌ఖాన్‌లు కేక్‌ కట్‌ చేశారు. అంధులకు రూ.5వేలు చెక్కును జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అందజేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో పార్టీ సమన్వయకర్త ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలూరు పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.  పత్తికొండలో పార్టీ నాయకులు పి. మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బనగానపల్లి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనాధలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నందికొట్కూర్‌లో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నంద్యాలలో రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు డాక్టర్‌ రామలింగారెడ్డి పండ్లు పంపిణీ చేశారు.

విజయనగరం:జిల్లాలో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులు పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కొలుగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వేడుకలు చేపట్టారు. బొత్స అప్పలనాయుడు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో రక్తదాన, అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో భారీ కేక్‌ కట్‌ చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 

విశాఖ:వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీజిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నగరంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చర్చీలలో పార్టీ నాయకులు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

తూర్పు గోదావరి: ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాకినాడలో యువజన విభాగం నాయకులు అనంతబాబు ఆధ్వర్యంలో అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యువజన విభాగం నేతలు వాసిరెడ్డి జమీల్, చంద్రశేఖర్, మురళీ, తోట సుబ్బరాయుడు నాయుడు ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కొండెటి చిట్టిబాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాజమండ్రిలో రౌతు సుర్యప్రకాశరావు, అమలాపురంలో విశ్వరూప్, చిట్టాబ్బాయి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సాంభమూర్తినగర్‌లో వైయస్‌ఆర్‌ విగ్రహానికి పార్టీ ఇన్‌చార్జ్‌ ముత్తా శశిధర్‌ పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ కట్‌ చేశారు. కోరుకొండ లక్ష్మీ నరసింహా ఆలయంలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత జక్కంపూడి విజయలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. పెండెం దొరబాబు ఆధ్వర్యంలో రోగులకు పాలు, బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. కడియంలో 200 కేజీల పూలమాలను వైయస్‌ఆర్‌ విగ్రహానికి వేసి నివాళులర్పించారు. జగ్గంపేటలో ముత్యాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, తూనిలో దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

పశ్చిమ గోదావరి:ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా నిర్వహించుకున్నారు. పార్టీ నాయకులు స్రరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొయ్యగూడెంలో  మాజీ ఎమ్మెల్యే బాలరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కోటారు రామచంద్రరావు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.  కోవ్వురులో మాజీ ఎమ్మెల్యే తేనెటి వనిత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ద్వారక తిరుమలలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.తణుకులో కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చింతలపూడిలో నవీన్‌బాబు, జానకీరెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.

కృష్ణా: జిల్లాలో వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ నగరంలో పార్టీ నాయకులు పార్థసారధి, వంగవీటి రాధాకృష్ణ, గౌతంరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. రామవరప్పాడులో గన్నవరం ఇన్‌చార్జ్‌ రామచంద్రరావు ఆధ్వర్యంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రక్షణ నిధి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మైలవరంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆధ్వర్యంలో అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. కైకలూరులో దూలం నాగేశ్వరావు ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌ చేశారు. నూజీవీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 

గుంటూరు: జిల్లా వ్యాప్తంగా వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మ్రరిరాజశేఖర్‌ కేక్‌ కట్‌ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటిరాంబాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. గురజాలలో కాసు మహేష్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పార్టీ నాయకులు రావి వెంకటరమణ పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 

ప్రకాశం: వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి వేడుకులు జరుపుకున్నారు. మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలిలోని వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంతనూతలపాడులో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో రక్తదాన, అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. చెంచిరెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కందుకూరులో తోమటి మాధవరావు, కనిగిరిలో బన్ని, సుబ్బారెడ్డి, దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్, పర్చూరులో గొట్టిపాటి భరత్‌ ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. 

నెల్లూరు: వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. నాయుడుపేట పట్టణంలో మహానేత విగ్రహానికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాళులర్పించారు. దువ్వూరులో బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. 

తెలంగాణ: 
వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ పేరిట ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ నాయకుడు వెల్లాల రామ్మోహన్‌ ఆధ్వర్యంలో సనత్‌ నగర్‌ నుంచి లోటస్‌ పాండ్‌ వరకు కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. పార్టీ నేతలు పలుచోట్ల రక్తదాన, వైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు. ఆస్పత్రుల్లో పెషెంట్లకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. హస్తినాపురంలో వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కీర్తన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మహిళలకు చీరలు, దుప్పట్లు, మిక్సీలు పంపిణీ చేశారు. 

కరీంనగర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నగేష్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టారు. సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయంలో వైయస్‌ఆర్‌సీపీ యూత్‌ జిల్లా నాయకులు జల్లి వేణు ఆధర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు స్వీట్స్‌ పంచిపెట్టారు. వరంగల్‌లోని టౌన్‌ చర్చిలో పార్టీ నాయకుడు శాంతికుమార్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహబూనగర్‌ ఏరియా ఆసుపత్రిలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కస్తుర్భా గాంధీ పాఠశాలలో తెలంగాణ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌ స్వీట్లు పంపిణీ చేశారు. మధిరలో వైయస్‌ఆర్‌ విగ్రహానికి చల్లా శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. 

ఖమ్మంలో లక్కినేని సుధీర్‌ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.  భద్రాచలంలో కొల్లు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో  అనాధలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంథోల్‌లో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వనపర్తిలో వైయస్‌ఆర్‌సీపీ నేత మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌ చేశారు. నాగర్‌ కర్నూలులో జిల్లా అధ్యక్షుడు భగత్‌రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లాలో పార్టీ నాయకుడు కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిర్యాలగుడలో రాష్ట్ర కారద్యర్శి సలీం, ఇన్‌చార్జ్‌ బ్రహ్మం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 


Back to Top