20న తెలంగాణలో రైతు దీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌
హైదరాబాద్‌:  కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ‌గా నిలిచింది. భూ సేక‌ర‌ణ చ‌ట్టం-2013 ప్ర‌కార‌మే న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని కోరుతూ పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 20న రైతు దీక్ష చేప‌ట్టేందుకు నాయ‌కులు సిద్ధ‌మ‌య్యారు. రైతుల భూములను ముంచి ప్రాజెక్టులను నిర్మించడం దారుణ మని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల భూములు, చేతి వృత్తులు, పనులు కోల్పోతున్న వారికి కేంద్ర భూసేకరణ చట్టం–2013 ప్రకారమే నష్ట పరిహారం, పునరావాస ప్యాకేజీని చెల్లించాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, కన్నేపల్లి, అన్నారం బ్యారేజీలవల్ల భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా ఈ నెల 20న పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సెగ్గం రాజేశ్‌ ఆధ్వర్యంలో మహదేవ్‌పూర్‌ మండలం సూరారంలో రైతు దీక్ష నిర్వహించనున్నారు.ఈ దీక్ష పోస్టర్‌ను లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు ఆవిష్కరించారు. పార్టీ నాయకులు జెన్నారెడ్డి, మహేందర్‌రెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, అప్పం కిషన్, వి.సతీశ్, బురా సుమన్, తడక జగదీశ్వర్‌గుప్తా పాల్గొన్నారు.
Back to Top