బాబూ ఆర్భాటపు ప్రచారాలు ఆపు..రైతుల కోసం చంద్రబాబు చేసింది శూన్యం..
–పార్వతీపురం నియోజకవర్గం రైతులు 
విజయనగరంః దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులపై నాలుగున్నరేళ్లగా దృష్టిపెట్టని చంద్రబాబు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హడావుడి చేస్తున్నారని పార్వతీ నియోజకవర్గం ప్రజలు అంటున్నారు. ఆ  ప్రాజెక్టులను తానే పూర్తిచేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. తోటపల్లి రిజర్వాయర్, జంఝావతి డ్యాం విషయంలో ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. రైతులు కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్‌ఆర్‌ హయాంలోనే పార్వతీపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు శంకుస్థాపన చేసి వదిలేసిన ప్రాజెక్టులను వైయస్‌ఆర్‌ హయాంలో ప్రాజెక్టుల  పనులు పూర్తి అయ్యాయన్నారు.
Back to Top