అమరావతిలో కూర్చోని గొప్పలు చెప్పడం కాదు

కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో కూర్చొని అది చేశాం, ఇది చేశామని గొప్పలు చెప్పడం కాదని, క్షేత్రస్థాయికి వస్తే ఆయన చేసింది ఏంటో తెలుస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అమరావతిలో కూర్చొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలా తమ పార్టీలోకి చేర్చుకోవాలో అని పాడు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, అందుకు సజీవ సాక్ష్యమే వైయస్‌ జగన్‌ పాదయాత్రలో వస్తున్న సమస్యలు అన్నారు. వైయస్‌ జగన్‌ ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌ను ఆదరిస్తున్నారని తెలిపారు. వచ్చేది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top