చంద్రబాబు వల్లే ప్రజలకు ఇబ్బందులు

కాకినాడ, 12 సెప్టెంబర్ 2013:

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. కిరణ్ కుమా‌ర్ రెడ్డి ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టిన‌ప్పుడు టిడిపి సభ్యులకు విప్ జారీ చేసి మరీ చంద్రబాబు నాయుడు కాపాడారని ఆయన మండిపడ్డారు. ‌తద్వారా విద్యుత్ ఛార్జీల పెంపునకు కూడా చంద్రబాబే కారణమయ్యారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించడంలో ప్రధాన పాత్రధారి చంద్రబాబేనని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. సీమాంధ్రలో ఆయన చేసిన బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన ఏమాత్రం లేకపోవడం వల్లే ఆయన ముందుగానే ముగించేశారని ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top