<strong>చంద్రబాబు ముస్లింలకు చేసింది ఏమీలేదు..</strong><strong>మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని...</strong>శ్రీకాకుళంః గత 35 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేసినా సరైన గుర్తింపు లేదని వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని అన్నారు. 2014 నా సీటును బాలకృష్ణకు తాగ్యం చేసినా టీడీపీ ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో తనకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. వైయస్ జగన్ పాదయాత్రకు అద్బుతమైన ప్రజాదరణ వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో జగన్ సీఎం అవుతారన్నారు. చంద్రబాబు ముస్లింలకు చేసింది ఏమిలేదని, తెలుగుదేశంపార్టీ మైనార్టీలకు ఏ ఒక పదవి ఇవ్వకుండా ఎన్నికల సమయంలో ఒక మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. వైయస్‌ఆర్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్ ద్వారా ఎంతో మంది మైనారిటీ విద్యార్థులు చదువుకుని ఉద్యోగాలు చేస్తుకుంటున్నారన్నారు. ఒక మైనారిటీ మాజీ ఎమ్మెల్యేగా వైయస్‌ఆర్‌సీపీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు.మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు.