ఆధ్యాత్మిక చింత ప్రతి ఒక్కరికీ అవసరం

చిత్తూరు: ఆధునిక ప్రపంచంలో ఎన్నో ఒత్తిళ్ళతో జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికS చింతన అవసరమని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కోటవీధిలోని బ్రహ్మకుమారి ఈశ్వరియోగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. తొలుత కేంద్ర ముందుభాగంలో ఏర్పాటు చేసిన పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేంద్రంలో ఏర్పాటు చేసిన 108 శివలింగాలకు జ్యోతిప్రజ్వల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పండుగలకు ప్రాముఖ్యత తగ్గిపోతున్న ఈరోజుల్లో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో ప్రతి ముఖ్యమైన పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ పండుగల పవిత్రతను తెలియజేసేందుకు కృషి చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. త్రిమూర్తి శకజయంతి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసి భక్తి భావాలను పెంపొందించడం హర్షించదగ్గ విషయమన్నారు. సేవా కార్యక్రమాలను పట్టణంలో విస్తృతం చేయడంతో పాటు మానవతా విలువలు పెంపొందించడం, ప్రజలల్లో మూడనమ్మకాలపై అపోహలను తగ్గించి భక్తి భవాలను పెంపొందిండ వల్ల అనేక శుభపరిణామాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహా శివరాత్రి పర్వదినాన ఆపండుగ పవిత్రతను తెళియజేస్తూ ప్రజలను జాగరణ కార్యక్రమంలో పాల్గోనేలా చేయడం మంచి పరిణామమన్నారు. ఈకార్యక్రమంలో బ్రహ్మకురీస్‌ సభ్యులు పద్మ, ఉమ, బాజాజి, రమణ, కౌన్సిలర్లు మస్తాన్‌రెడ్డి, తులసీరామకృష్ణ, ఎమ్మెల్యే సోదరులు దేశాయ్‌ జయదేవ్‌రెడ్డి, డాక్టర్‌ రామిరెడ్డి, ౖవైయస్‌ఆర్‌సీపీ టౌన్‌కన్వీనర్‌ సురేంద్ర, నాయకులు తట్టినాగరాజు రెడ్డి, చంద్రశేఖర్, మోహన్, అబ్రార్‌ బాషా, వినుత, కమల తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top