నవరత్నాలతో ప్రతి పేదవాడికి లబ్ధి

బిక్కవోలు : ప్రతి పేదవాడికి లబ్దిచేకూరే విధంగా వైయస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకానికి రూపకల్పన చేశారని మండల కన్వీనర్‌ వంగా రామగోపాలరెడ్డి అన్నారు.శనివారం బిక్కవోలులో 82వ బూత్‌లో ఇంటింటికి వెళ్ళి నవరత్నాల పథకం యొక్క ప్రయోజనాలను వివరించారు. రాజన్న రాజ్యం తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరు వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వామ్యులు కావాలని విజ్నప్తి చేశారు. నవరత్నాల ద్వారా రైతు భరోసా, డ్రాక్రా మహిళలకు ఆసరా, అమ్మ ఒడి, ప్రతి పేదవానికి సొంతిల్లు, పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ పథకాలతో ప్రతి పేదవానికి మరింత మేలు చేకూరుతుందన్నారు. ప్రభుత్వం పనితీరు పై ప్రజల మనోగతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కోరుకొండ నాగేశ్వరరావు, మండల యువజన అధ్యక్షడు గువ్వల సత్తిరెడ్డి, వాణిజ్య విభాగ అధ్యక్షులు బొండా శ్రీనివాసగుప్తాజీ, తొండాపు సాయిరామారెడ్డి, యమసాని సుమన్, జి.వెంకటేష్, కొమ్మసాని వంశీ, తదితరులు పాల్గొన్నారు.

కొంకుదురులో : మాజీ రాష్ట్ర మార్కఫేడ్‌ డైరెక్టర్‌ సత్తినాగిరెడ్డి రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బూత్‌ లెవెల్‌ కన్వీనర్‌లు నల్లమిల్లి అమ్మిరెడ్డి, పడాల వీరవెంకటసత్యనారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొంకుదురు పీవి, మల్లిడి కోదండం, ఎస్వీ సూర్యనారాయణరెడ్డి తదితరులు గ్రామంలో పర్యటించి నవరత్నాల పై ప్రజలకు తెలియచేశారు. కాపవరంలో సత్యంశెట్టి వెంకటరమణ, బూత్‌ లెవెల్‌ కన్వీనర్‌ కుంతం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Back to Top