'ఎన్నికలంటేనే హడలెత్తిపోతున్న కాంగ్రెస్'

కరీంనగర్, 24 ఏప్రిల్‌ 2013: ఎన్నికలంటే కాంగ్రెస్‌ పార్టీ హడలెత్తిపోతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశరావు వ్యాఖ్యానించారు. చివరకు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అది నిర్వహించలేక పారిపోతోందని ఆయన విమర్శించారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవటం ఖాయమని ప్రకాశరావు జోస్యం చెప్పారు. తన సర్వేలన్నీ ఎప్పుడూ నిజమే అయ్యాయని ఆయన బుధవారం కరీంనగర్‌లో అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగానూ, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగానూ ఉన్న చంద్రబాబు నాయుడు ఇక ఆ రికార్డుకే పరిమితం అయ్యారని గోనె ప్రకాశరావు ఎద్దేవా చేశారు.

తాజా ఫోటోలు

Back to Top