<strong>వైయస్ జగన్‌కు డీఎస్సీ అభ్యర్థులు ఫిర్యాదు..</strong>శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను బావాజీపేట గ్రామ మహిళలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమకు ఎలాంటి పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుకుంటోంని మండిపడ్డారు. డీఎస్సీ జరుగుతుందా లేదా అనే గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు.లక్షల ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని డీఎస్సీ తక్కువ పోస్టులు విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.డీఎస్సీని పొడిగిస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసగించారన్నారు. పసుపు–కుంకుమ డబ్బులు పొదుపు డబ్బుల్లో జమ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ కూడా సరిగా రావడంలేదని, రేషన్ బియ్యంలో కోత పెడుతున్నారన్నారు. అన్ని సంక్షేమ పథకాలు రావాలంటే వైయస్ జగన్ రావాలన్నారు.